చాలా రోజుల తరువాత బాక్సాఫీసు బరిలో ఆసక్తికర పోరు

మార్చి 11న ఐదు చిత్రాలు విడుదల కానున్నాయి. ఇందులో శర్వానంద్‌ నటించిన ‘శ్రీకారం’, శ్రీవిష్ణు నటించిన ‘గాలి సంపత్‌’, నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ‘జాతిరత్నాలు’ … ప్రత్యేక కథాంశాలతో రూపుదిద్దుకోవటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రైతుల జీవితాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో వస్తున్న ‘శ్రీకారం’పై ఆసక్తి నెలకొంది. ఇక ‘గాలి సంపత్‌’లో మాటలు రాని వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్‌, ఆయన్ను ఆటపట్టించే కొడుకుగా శ్రీవిష్ణు నటించారు. స్వప్న సినిమాస్‌ బ్యానర్‌లో ప్రముఖ దర్శకుడు నాగ అశ్విన్‌ నిర్మించిన సినిమా ‘జాతి రత్నాలు’ మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూడు సినిమాలతో పాటు ‘దేవరకొండలో విజరు ప్రేమకథ’, ‘రాబర్ట్‌’ విడుదల కాబోతున్నాయి. చాలా రోజుల తరువాత బాక్సాఫీసు వద్ద ఆసక్తికర పోరు నెలకొంది.