పవన్ – రానా మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

పవన్ కల్యాణ్ .. రానా కథానాయకులుగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా రూపొందుతోంది. కొంతవరకూ షూటింగు జరిగిన తరువాత కరోనా ఉద్ధృతి పెరగడంతో షూటింగును ఆపేశారు. మళ్లీ ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుండడంతో, ఈ నెల 11వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. తాజాగా ఈ సినిమాకి ఒక  టైటిల్ ను పరిశీలిస్తునట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.

ఈ సినిమాలో పవన్ – రానా ఇద్దరి పాతలు ప్రధానమైనవే. రెండు పాత్రలకి సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. మలయాళంలో ఈ రెండు పాత్రల పేర్లను కలిపే టైటిల్ పెట్టారు. అదే పద్ధతిని తెలుగు రీమేక్ లోను పాటించనున్నారు. అలా ఈ సినిమాకి ‘పరశురామ కృష్ణమూర్తి’ అనే టైటిల్ ను సెట్ చేయాలనుకుంటున్నారట. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో, నిత్యామీనన్ .. ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు.