వరికూటి సోదరుల పేర్ల మీద సర్వమత ప్రార్ధనలు

దర్శి, వరికూటి నాగరాజు మరియు వారి సోదరులు వరికూటి సురేష్ బాబు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని దర్శి నియోజకవర్గంలో 4 రోజులు నిర్వహించే క్రమంలో మూడవరోజు పలుచోట్ల ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన దర్శి నియోజకవర్గం జనసైనికులు. మూడవ రోజులో భాగంగా శుక్రవారం దర్శి పట్టణం లంకోజనపల్లి రోడ్డులో గల మసీదు నందు దువా కార్యక్రమం, పుట్ట బజార్ లో చర్చిలోని పాస్టర్లతో ప్రార్థన కార్యక్రమం మరియు తాళ్లూరు మండలం పడమర గంగవరంలో అయ్యప్ప స్వాములు సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జనసైనికులు వరికూటి నాగరాజు వారి సోదరులు వరికూటి సురేష్ బాబు (జర్మనీ)ల పేర్ల మీద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసైనికులు షేక్ ఇర్షాద్, షేక్ బాషా, వరికూటి అనిల్, నూగుల మల్లి నాయుడు, వేళ్ళ కోటి, తోట అయ్యప్ప, పెండ్లి బద్రి, బండారు సుబ్బారావు, నీలిశెట్టి ప్రభు, గోగు శ్రీను, పాశం వెంకటేష్, ఓబులాపురం కొండ, గోగు రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.