అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి పాలకొండ డిఎస్పికి ఆహ్వానం

మన్యం జిల్లా, పాలకొండ డివిజనల్ సూపరిన్టెండెంట్ ఆఫ్ పోలీస్ జి.వి కృష్ణారావుని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిన మోహన్ రావు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బూరుగా గ్రామంలో ఏప్రిల్ 14న జరగబోయే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి జి.వి కృష్ణారావుని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూరుగా గ్రామ జైభీమ్ యువజన సంఘ సభ్యులతో డిఎస్పి మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, బాగా చదువుకోవాలి అని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఐక్యంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో బూరుగా గ్రామ జై భీమ్ యువజన సంఘ సభ్యులు పరశురాం, గోవింద్, తిరుపతి, రామారావు, పైడిరాజు, తవిటయ్యతో పాటు వీరఘట్టం మండల దళిత నాయకులు మరియు జనసేన నాయకులు వజ్రగడ రవి కుమార్(జానీ) పాల్గొన్నారు.