బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ను సమస్యల వలయంగా మార్చేసిన వైసిపి ప్రభుత్వం: బాబు పాలూరు ద్వజం

బొబ్బిలి: జనసేన నాయకులతో జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు కలిసి శుక్రవారం బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ని సందర్శించి.. కాంప్లెక్స్ యొక్క ఇంచార్జి తో మాట్లాడి బొబ్బిలిలో నిత్యం 5 వేలు పైచిలుకు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు, పేదవాడి విమానం ఈ ఆర్టీసీ బస్సు కదా, అటువంటిది కనీస మౌలిక వసతులు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అలాగే ప్రయాణికులు కూర్చోడానికి కుర్చీలు కూడా లేవని, అస్సలు ఆర్టీసీ కాంప్లెక్స్ లో కరెంటు లేకపోవడం దారుణమని, కనీసం సోలార్ పెట్టి ఒక రెండు, మూడు లైట్స్ అయినా రాత్రి పూట వెలిగించి ప్రయాణికులకు వెలుగును ప్రసాదించండని, కూర్చోవడానికి విరిగిపోయిన కుర్చీలు, కాంప్లెక్స్ మొత్తానికి కేవలం 4 ఫ్యాన్స్ ఏంటని, త్రాగు నీరు సదుపాయం లేకపోవడమేంటని, టాయిలెట్స్ లేక మహిళలు నానా అవస్థలు పడుతున్నారని, ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ని మూసేసి ప్రయివేట్ టాయిలెట్స్ ఉపయోగించమని చెప్తున్నారని, అవి కూడా కనీసం పరిశుభ్రతగా ఉండాలి కదా అని దుమ్మెత్తారు, కాంప్లెక్స్ ఆవరణం మొత్తం అపరిశుభ్రతగా ఉందని, ఇలా అయితే ప్రయాణికులు రోగాల బారిన పడకుండా ఎలా ఉంటారని, విజయనగరం జిల్లాలో 2వ అతిపెద్ద నగరమైన బొబ్బిలిలో ఆర్టీసీ కాంప్లెక్స్ దుస్థితి ఏంటని నిలదీశారు. కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న మొత్తం 38 షాప్స్ ఉన్నాయి, వాటి నుండి నెలకి 5లక్షలు పైనే ఆదాయం వస్తుంది. మరి ఇదంతా ఎక్కడికి పోతుందని, ఆ డబ్బులతో ఆర్టీసీ కాంప్లెక్స్ ని పరిశుభ్రంగా మరియు ప్రయాణికులకు కావలసిన మౌళిక సదుపాయాలు కల్పించొచ్చు అని తెలియజేసి దీనిపై ఒక వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్ సంచాన, జనసేన పార్టీ వీరమహిళలు బంటుపల్లి దివ్య, రమ్య, నాయకులు పల్లెం రాజా, బెవర గణేష్, మహంతి ధనంజయ్, సత్యనారాయణ, చీమల సతీష్, వెంకటరమణ, గేదెల శివ, చందక రామకృష్ణ, పోతల శివశంకర్, శంకర్, కిరణ్, తీగల నరేష్, సంతోష్, రాజు, మోహన్, అలాగే రాంభద్రపురం, తెర్లాం, కోమటిపల్లి, అలజంగి, అప్పయ్యపేట, గ్రామాల జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.