మాట తప్పి మడమ తిప్పిన జగన్: పత్తి సురేష్ బాబు

కొయిలకుంట్ల, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ప్రతి సందర్భంలో మాట తప్పి మడమ తిప్పు తున్నారని జనసేన పార్టీ నాయకులు పత్తి సురేష్ బాబు విమర్శించారు. గ్రామ రెవెన్యూ సహాయకులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ గత పది రోజులుగా స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు జనసేన పార్టీ నాయకులు పత్తి సురేష్ బాబు, దోడియం గురప్ప, బోధనము ఓబులేసు, కిట్టు, భాను ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. అనంతరం జనసేన నాయకులు పత్తి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి వీఆర్ఏ లకు జీతాలు పెంచుతామని అలాగే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో మాట తప్పి మడమ తిప్పి పారిపోతున్నారు అని ఎద్దేవా చేశారు. వీఆర్ఏల డిమాండ్ల సాధనలో భాగంగా వారికి జనసేన పార్టీ మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు.