పేదలకు౼పెత్తందారులకు మధ్య పోటీ అని గొప్పలు చెప్పావు కదా జగన్ రెడ్డి: గాదె

గుంటూరు తూర్పు నియోజకవర్గం: జున్ను షాహిద్ నగర్ వాసులైన పేద ముస్లిం కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ జనసేన తరఫున మేము వారికి అండగా ఉంటామని జనసేన నాయకులు గాదె అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ లోని 10వ వార్డులో బిఆర్ స్టేడియం వెనుక ఉన్న జున్ను షాహిద్ నగర్లో దాదాపు పేద ముస్లిం లు సుమారు 200 కుటుంబాలు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. ఈ కాలనీలో స్థానికులకు రోడ్లు వేశారు అందరికీ మున్సిపల్ కుళాయిలు కలెక్షన్లు ఉన్నాయి. వారు కరెంట్ బిల్లు అలాగే మున్సిపల్ పన్నులు కూడా కడుతూ జీవనం సాగిస్తున్నారు.. ఒక్కసారిగా మున్సిపల్ అధికారులు వచ్చి స్థానికులకు ఇంకొక చోట వసతి చూపించకుండా ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా పార్టీ ఆఫీసుకు వెళితే అక్కడ మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేడు అలాగే వారికి కాల్ చేస్తే నేను బిజీగా ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను అని మాయమాటలు చెప్పి తప్పించుకున్నారు అని స్థానికులు చెబుతుంటే చాలా బాధాకరంగా ఉంది. మేము జగన్ గారిని సీఎంగా చూడాలని అందరం కలిసి ఓట్లు వేసి గెలిపిస్తే మమ్మల్ని రోడ్లపై పడేసాడని వాపోతున్నారు.. ప్రజా ప్రతినిధి అంటే మీ ఫోటోలు, ఫ్లెక్సీలు పేపర్లలో వేసుకోవడం కాదు స్థానికులు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారు ఇలా పేదవారికి అన్యాయం జరుగుతుంది అని తెలిసి కూడా నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావె నువ్వు ఏమి ప్రజాప్రతినిధివి..? పేదలకు అన్యాయం జరుగుతుంటే దాక్కొని తిరుగుతున్నావ్ నువ్వు ఒక ఎమ్మెల్యే వి పిలవడానికి సిగ్గుగా ఉంది.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా ఈ మధ్య స్లొగన్స్ ఇస్తున్నాడు కదా..! పేదలకు౼పెత్తందారులకు మధ్య పోటీ. రేపు రాబోయేది 2024 కురుక్షేత్రం మీరు పేదల పక్షాన ఉంటారా లేక పెత్తందారుల పక్షాన ఉంటారా అని అన్నాడు కదా.. మరి ఇప్పుడు మీరు ఇక్కడ పేద ప్రజల పక్షాన ఉన్నారా లేక పెత్తందారులు పక్షాన ఉన్నారా అని జనసేన పార్టీ అడుగుతుంది.. జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈ జున్ను షాహిద్ నగర్లో ఉన్న పేద ముస్లిం కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ మేము వారికి అండగా ఉంటాము. రోడ్లపై వచ్చి ధర్నాలు కూడా చేస్తాము వారికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ వారికి తోడు ఉంటుందని స్థానికులకు అండగా ఉంటామని తెలిపారు.. నాయుబ్ కమల్ మాట్లాడుతూ.. జున్ను షాహిద్ నగర్ లో గత 40 సంవత్సరాలు నుంచి ఇక్కడ మా పేద ముస్లిం కుటుంబాలు నివాసిస్తున్నాయి. వీరి ఇల్లు అన్యాయంగా అక్రమంగా పగలగొట్టడం చాలా బాధాకరం మా మైనారిటీలు జగన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించినందుకు మమ్మల్ని ఓటు బ్యాంకుగా చూస్తున్నాడే కాని మా ముస్లింల ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నగర నాయకులు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.