సింగనమల జనసేన ఆధ్వరంలో జగనన్న మోసం

సింగనమల, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా అద్యక్షులు టీసి వరుణ్ సూచనలతో జగనన్న ఇల్లు పేదోడి కన్నీరు కార్యక్రమంలో బాగంగా శనివారం సింగనమల నియోజకవర్గ పరిధిలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో గల జగనన్న కాలనీలను మండల కన్వీనర్ జి.ఎర్రిస్వామి ఆద్వర్యంలో.. సందర్శించడం జరిగింది. ఇల్లు కేటాయించిన జనం. వారి యొక్క గోడును జనసేన పార్టీకి విన్నవించారు. మొదట్లో మన ముఖ్యమంత్రి నవరత్నాల్లో భాగంగా ఇల్లు లేని ప్రతి కుటుంబంకు ఇల్లు తామే కట్టించి, అక్క చెల్లెమ్మలకు తాళాలు చేతికిస్తానని చెప్పి అధికారం రాగానే మాట మార్చి కొండలలో గుట్టలలో స్ధలాలు కేటాయింపు చేసి ముందు ప్రభుత్వం లాగానే 4 దఫాలుగా బిల్లును చెల్లింపు ఉంటుంది. మీరే కట్టు కోవాలని లేకుంటే స్థలం వెనక్కి తీసుకుంటామని బెదిరించారని అప్పుచేసి ఇల్లు కట్టుకున్న కొందరికి బిల్లులు సరిగా చెల్లింపు చేయక వారు నిర్మాణాలు మద్యలోనే ఆపుకున్నారు. ప్రభుత్వ భూములను ప్రయివేట్ వ్యక్తి భూములుగా నకిలీ పత్రాలను సృష్టించి వాటిని కొనుగోలు చేసి బారీగా వైసిపి నాయకులు ప్రజాధనం దోచుకున్నారని తెలిపారు. జగనన్న ఇల్లు నెపంతో బుక్కరాయసముద్రం పంచాయతీ లోని అడ్డదిప్ప కొండ మట్టిని ఎమ్మెల్యే అనుయాయులు నామ మాత్రపు అనుమతులతో కొన్ని వందల ఎకరాల్లో దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన ఎర్రమట్టి మైనింగ్ స్కాం జరిగింది. వీటిపై లోకల్ గా ఉన్న నాయకులు ఆధికారులదృష్టికి తీసుకుని వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఇలాంటి ప్రజాధనం దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించడం జరిగింది అని పీడిత వర్గాల గొంతుకగా జనసేన పార్టీ పనిచేస్తుంది అని ఈ వసీపి పాలకులు చేసే అవినీతిని అక్రమాలను బట్ట బయలు చేసి ప్రజలకు, ఈ దేశానికి తెలిసేలా సోషల్ మీడియా ఉద్యమం జనసేన పార్టీ చేస్తోందని తెలుపటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చొప్పా. చంద్ర శేఖర్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి జయమ్మ, మండల కన్వీనర్ ఎర్రిస్వామి, ఉపాద్యక్షులు సిరిసాల సుమన్, ప్రధాన కార్యదర్శి తాహీర్, మండల నాయకులు వంశీ, అవ్వారి రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.