మైలవరం జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు

  • టిడ్కో ఇళ్లకు జగన్ రెడ్డి గ్రహణం పట్టింది.
  • •కొన్ని వందలమంది పేద ప్రజల సొంత ఇంటి కల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సాకారం కాలేదు
  • జగన్ గారి ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు జరగవు.
  • వడ్డీలు వాయిదాలు కట్టలేక లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు.
  • పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తూ విష సర్పాలకు ఆవాసంగా మారి నిర్మాణస్యంగా ఉండడం వలన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి.
  • పరిశీలన నివేదిక పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తాం
  • కేంద్రం పథకం రాష్ట్ర ప్రభుత్వ పథకం లాగా వైసిపి వారు కలరింగ్ బులుగు రంగు వేసి ఇస్తున్నారు.

మైలవరం: జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని ఒక భాగమైన జక్కంపూడి మరియు ఇలాప్రోలు గ్రామంలోని టిడ్కో ఇళ్లను మైలవరం ఇన్చార్జ్ అక్కల గాంధీ తో కలిసి విజయవాడ నగర పార్టీ అధ్యక్షులు పోతిన మహేష్ సందర్శించినారు. ఇల్లు పూర్తి చేసి ఇస్తామని చెప్పి లబ్ధిదారుల మీదే భారం వేసిన మోసకారి జగన్ రెడ్డి జక్కంపూడి లో ఉన్న టిడ్కో గృహ సముదాయాన్ని మైలవరం ఇంచార్జ్ అక్కల గాంధీ, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జనసేన పార్టీ జెండా దిమ్మ వద్ద జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా జక్కంపూడి షాబాద్ లో ఉన్న టిడ్కో గృహ సముదాయాన్ని విజయవాడ మరియు మైలవరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి పరిశీలించారు. ఈ సోషల్ అడిట్ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల జనసేన అధ్యక్షులు పోలిశెట్టి తేజ, జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, సామల సుజాత, కుమారి, బస్టాండ్ రాధా, ఏతిరాజుల ప్రవీణ్, యర్రంశెట్టి నాని, సిరిపురం సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.