షేక్ మహబూబ్ మస్తాన్ అద్వర్యంలో జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్

ఆత్మకూరు: జగనన్న ఇల్లు – పేదలందరికీ కనీళ్లు #JaganannaMosam అనే హాష్ టాగ్ లైన్ తో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆమోదంతో అనంత సాగరం మండలం, ఆమని చిరివేళ పంచాయితీ పరిధిలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ పర్యటించారు. ఈఅ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రం ఈ నెల 12 ,13,14 వ తారీకులలో “జగనన్న ఇల్లు – పేదలందరికీ కనీళ్లు” జగనన్న మోసం హాష్ టాగ్ 14వ తేదీన కార్యక్రమం విషయానికి వస్తే జగన్ రెడ్డి నవరత్నాల్లో కీలక అంశం అయినా పేదలందరికీ సొంత ఇల్లు అందిస్తాను అని వాగ్దానం చేసారు ముఖ్యమంత్రి . రాష్ట్రము లో 68 వేల ఎకరాలో 28 లక్షలు ఇల్లు ఇస్తాం అన మాట ఏమి అయింది అని అన్నారు. అనంత సాగరం మండలం లో 1030 పై చిలుకు జగనన్న ఇల్లులు ప్రభుత్వం. అందులో ఆమని చిరివెళ 40 పైగా జగ్గన్న కాలనీ ఇచ్చినది. 4 వ సంవత్సరం నడుస్తునా ఇప్పటికి ఒక్కఇల్లు కూడా లబ్దిదారులకు పూర్తీగా అందించలేకపోవటం నిజంగా జగన్ రెడ్డి ప్రభుత్వానికే సిగ్గు చేటు అన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులతో కలిసి సందర్శించి ఇళ్ల లబ్ధి దరుల బాధితులకి అండగా జన సేన పార్టీ అండగా నిలబడుతాం అని చెప్పడం జరగింది.