అంగనవాడి కార్యకర్తల ఆందోళనకు సంఘీభావం తెలిపిన జనసేన

దర్శి, అంగనవాడి కార్యకర్తల ఆందోళనకు నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట్ సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా వెంకట్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల శ్రమను దోపిడీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, వారికీ పని భారం తగ్గించాలని, వేతనాలు పెంచాలని, ప్రభుత్వ పథకాలు వారికి అందాలని, రిటైర్మెంట్ పెన్షన్ స్కీం అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.