న్యాయం చేసిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్‌

  • జనవాణి కార్యక్రమంలో పొన్నలూరు దళితులు సమస్య పరిష్కారం జరిగింది
  • సమస్యలు ఉంటే పొన్నలూరు జనసేన పార్టీ కార్యాలయం వద్దకు రండి

కొండెపి నియోజకవర్గం: ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొన్నలూరు మండలంలో దళితులు పాల్గొని వారి సమస్యలు ప్రస్తావించడం జరిగింది, జరుగుమల్లి మండలంలో పైడిపాడు గ్రామం నందు ఉన్న “జె పి పవర్ వెంచర్స్ ఓపెన్ రీచ్” నందు ఉన్నటువంటి ఇసుక దగ్గర పొన్నలూరు ఎస్ సి కాలనీకి చెందిన కంచర్ల రామకృష్ణ, దార్ల రాజేష్, చుక్కా రామకృష్ణ అనే ముగ్గురు దళితులు సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు, నెల రోజులు వారితో పని చేయించుకుని జీతం ఇవ్వకుండా, భోజనాలు పెట్టకుండా, పగలు మరియు రాత్రి డ్యూటీ చేయించుకుని, క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు 10వ తరగతి పాస్ అయినట్టు సర్టిఫికెట్ కూడా తీసుకొని రండి అంటూ శ్రీనివాసులు మరియు కాశి అనే ఇద్దరు వ్యక్తులు ఆంక్షలు విధించి, నెల రోజులు పాటు ముగ్గురితో పని చేయించుకున్నారు. జీతం ఇవ్వండి అని దళితులు అడగగా, మీ దిక్కున చోట చెప్పుకోండి అంటు భయభ్రాంతులకు గురి చేశారు, దళితులకు అండగా కనపర్తి మనోజ్ కుమార్ ఉండి, శ్రీనివాసులు మరియు కాశి అనే ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి, దళితులకు రావాల్సినటువంటి నెల జీతాన్ని ఇప్పించడం జరిగింది, ప్రజలకు సమస్య వస్తే పొన్నలూరు జనసేన పార్టీ కార్యాలయం వద్దకు రండి, పొన్నలూరు మండలం ప్రజలందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని మండల అధ్యక్షుడు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో దళితులకు అండగా ఐటి విభాగం అధ్యక్షులు పిల్లిపోగు పీటర్ బాబు, ప్రధాన కార్యదర్శి ఖాదర్ బాషా, కార్యదర్శి నూకల లక్ష్మణ్, కార్యదర్శి సుంకేశ్వరం శ్రీను, కార్యదర్శి మెండ భానుచందర్ నవీన్ కుమార్, నందకిషోర్, పవన్ కళ్యాణ్, మౌనతేజ మరియు జనసైనికులు పాల్గొన్నారు.