వరదయ్యపాలెంలో జనసేన సమావేశం

సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెం మండలంలో ఆదివారం అన్ని మండల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ప్రతి మండల కేంద్రంలో మరియు గ్రామాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు మరియు అనుబంధ కమిటీలు, బూత్ కమిటీలు వేయాలని జిల్లా కార్యదర్శులు కొప్పల లావణ్య కుమార్, దాసు హేమ్ కుమార్ తెలియజేయడం జరిగింది. సత్యవేడు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాల మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ చెన్నైలో కేసు వేసి అక్రమ తవ్వకాలను నిలిపివేసినటువంటి జిల్లా కార్యదర్శి దాసు హేమ్ కుమార్ ని మరియు నాగలాపురం మండలం అధ్యక్షులు మణికంఠయ్యని అన్ని మండలాల అధ్యక్షులు సన్మానించడం జరిగింది.