ఆంధ్రప్రదేశ్ భవితపై జనసేన ప్రజా సంతకం ఖచ్చితంగా ఉండబోతుంది: బత్తుల

  • జనసేన వీరుల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో ఈ అవినీతి వైసీపీ వారికి రుచి చూపిస్తాం
  • జనసేన పార్టీ తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు
  • ప్రతి పేదవాడు స్వేచ్ఛగా, గొప్పగా బ్రతకాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆశయం
  • బడుగు బలహీన వర్గాల పేదరిక నిర్మూలన జనసేన పార్టీ లక్ష్యం
  • రాజనగరం మండలం, పాత వెలుగుబంద గ్రామంలో జనం కోసం జనసేన, మహాపాదయాత్రకు అడుగడుగున జననీరాజనం
  • ఈ సందర్భంగా “బత్తుల” కామెంట్స్
  • సమాజ శ్రేయస్సు కోసం పుట్టిన జనసేన పార్టీ విజయానికి మనమందరం శక్తి వంచన లేకుండా కృషి చేద్దాం
  • రాష్ట్రం మనది.. భవిత మనది.. రాష్ట్ర అభివృద్ధికి జనసేన పార్టీ తరపున మన వంతు కృషిని నిబద్ధతతో చేద్దాం
  • అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు మెచ్చే పారదర్శక పరిపాలన అందించాలన్నదే అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మనోగతం
  • రాజానగరం నియోజకవర్గాన్ని అవినీతిరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం
  • వారాహి విజయయాత్రతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, మహిళ లు మారుతున్నారు, యువత మారుతున్నారు, రైతులు మారుతున్నారు, కూలీలు, రైతు కూలీలు, కార్మికులు కర్షకులు, పవనన్న ప్రజా పరిపాలన కోసం ఎదురుచూస్తున్నారు
  • పాతవెలుగుబంధ గ్రామంలో జనసేన పార్టీకి ప్రజల నుండి ఏకపక్షంగా పెద్ద ఎత్తున మద్దతు
  • ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి ప్రజా పరిపాలన తీసుకురావాలని కోరిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: పాత వెలుగుబంధ గ్రామంలో మంగళవారం నిర్వహించిన జనం కోసం జనసేన, మహా పాదయాత్రను నిర్వహించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారికి గ్రామ ప్రజానీకం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏకపక్షంగా మద్దతు తెలియజేసి, రానున్న ఎన్నికల్లో పూర్తిగా జనసేన పార్టీ పక్షాన నిలబడి. బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వాన్ని బలపరిచి.. పవన్ కళ్యాణ్ గారి ప్రజా పరిపాలన కోసం ఎదురుచూస్తున్నామని వారే చెప్పడం చూస్తుంటే ప్రజలు ఏ స్థాయిలో మార్పు కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. యువత కేరింతలతో, అడుగడుగున మహిళల హారతులతో ప్రజానీకం జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టేలా సుదీర్ఘంగా సాగింది ఈ మహాపాదయాత్ర. ఈ కార్యక్రమంలో పాత వెలుగుబంధ జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, మండల నాయకులు, వెలుగుబంధ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.