మంగళగిరి కార్పొరేషన్ ఎన్నికలకి జనసేన సిద్ధం – ఎన్నికలు పెట్టే సత్తా ఉందా..?

  • ప్రజల తరఫున పోరాడుతున్న పార్టీ జనసేన పార్టీ
  • ప్రచారాలకే అంకితం అవుతున్న వైసిపి ప్రభుత్వం

మంగళగిరి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చే ఆమోదం పొందిన మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కమిటీ నియామక సమావేశం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం ఉదయం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ అధిష్టానం ఆమోదంతో ఎంటిఎంసి కమిటీకి అధ్యక్షులుగా మారుతీరావుని నియమించి, కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ముందుగా ఎంటిఎంసి అధ్యక్షులు మారుతీరావుకి మరియు నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ పార్టీ చేయనటువంటి గతంలో అధికారంలో ఉన్న పార్టీ గాని, నేడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ చేయనటువంటి కార్యక్రమం ఈరోజున మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కి అధ్యక్షులు, కార్యదర్శులుగా 47 మందితో కమిటీ నియమించడం జరిగింది. మారుతీ రావు రాజకీయంగా మంచి అనుభవం కలిగిన వ్యక్తి అందరూ సహకరించి ముందుకు నడిపించాలని కోరారు. జనసేన పార్టీ దినదిన అభివృద్ధి చెందుతూ అధికార పార్టీ వారికి గుండెల్లో భయం నింపుతుంది. ఇదే ఉత్సాహంతో మీ మీ ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికై మరింత కృషి చేసి 2024 లో పవన్ కళ్యాణ్ ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరికి నేను ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటాను, క్రమశిక్షణతో పార్టీలో మీ వంతు బాధ్యత వహించండి ఏ కష్టం వచ్చినా మీ వెంట నేనుంటాను అని కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చారు. ఈ వైసీపీ ప్రభుత్వం వారు మంగళగిరిలో ఏ భయంతో అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెడతలేదో, ప్రజలకు సమాధానం చెప్పాలి. మేము సిద్ధం ఎన్నికలకి, అధికారం మీ చేతిలో ఉండి కూడా మునిసిపల్ ఎన్నికలు పెడతానికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటిఎంసి నగర అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీ రావు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), ఎంటిఎంసి మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుభాని, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, మంగళగిరి నియోజకవర్గ యూత్ నాయకులు చిట్టెం అవినాష్, ఎంటిఎంసి కమిటీ సభ్యులు, మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండల కమిటీ సభ్యులు, చిల్లపల్లి యూత్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.