అంగన్వాడి ఉద్యోగుల సమ్మెకు జనసేన సంఘీభావం

రంపచోడవరం నియోజవర్గం: అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 3రోజు అడ్డతీగల మండలంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని జనసేన పార్టీ రంపచోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు కర్ల రాజశేఖర్ రెడ్డి, అడ్డతీగల మండలం, జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం సందర్శించి సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులకు తక్షణమే ప్రభుత్వం వేతనం 26,000 రూపాయలకు పెంచాలని అలాగే వారి గ్రాట్యూటీ పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యవస్థ నడవడంలో ముఖ్య పాత్ర పోషించే అంగన్వాడీ వర్కర్లను విస్మరిస్తూ వారి డిమాండ్లను పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు రానున్న జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వంలో అంగన్వాడి వర్కర్లకు సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రంపచోడవరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు పాపోలు శ్రీనివాస్ రావు, రాజవొమ్మంగి జనసేన పార్టీ మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి త్రిమూర్తులు, కొంణం శ్రీనివాస్, పొడుగు సాయి, మణికంఠ, అప్పాజీ, ప్రసాదు, చిన్నారెడ్డి, లోకేష్, బద్రి, చిన్న మరియు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.