దళితులకు జనసేన అండగా ఉంటుంది: కనపర్తి మనోజ్ కుమార్

*నా దళితుల జోలికి వస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు తప్పదు

*దళితులకు “జనసేన పార్టీ” అండగా ఉంటుంది

*అధికారం మరియు అగ్రకులం ఉంది అని దళితుల జోలికి వస్తే ఒక్కొక్క దళితుల్లో ఒక్కొక్క అంబేద్కర్ ను చూడాల్సి వస్తుంది

ప్రకాశం జిల్లాలో, కొండేపి నియోజకవర్గంలో, పొన్నలూరు మండలంలో, సుంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నల్లపు మాలకొండయ్య (ఎస్సీ మాల) కి 1977 వ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నందువలన ప్రభుత్వం మాలకొండయ్యకు సర్వే నెంబర్ “153-1 ఆఛ్ 2-71” సెంట్లు భూమిని ఇచ్చి, పట్టాదారు పాస్ పుస్తకం కూడా అప్పట్లోనే మంజూరు చేయడం జరిగింది. ఆ భూమిని వంశపారపరంగా వ్యవసాయం చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 2017 సంవత్సరంలో ముండ్లమూరివారి పాలెం గ్రామానికి చెందిన కొంతమంది అగ్రకులస్తులు ఈ భూమి తనదంటూ బెదిరించడం జరిగింది, 2017లో నాటి ఎం.ఆర్.ఓ ఈ భూమి నల్లపు మాలకొండయ్య దే అని ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మూడు రోజుల క్రితం జేసీబీ ని తీసుకొని వచ్చి పొలంలో ఉన్నటువంటి పిచ్చి చెట్లను తీసేయడం జరిగింది, ఈ పొలం మాది అని నల్లపు మాలకొండయ్య కుటుంబ సభ్యులు వచ్చి అడగగా, ఈ పొలానికి మీకు ఎటువంటి సంబంధం లేదు అని బెదిరిస్తున్నారు మరియు భూతులు తిడుతున్నారు, ముండ్లమురివారిపాలెం గ్రామ కాపురస్తులైన

  1. తానికొండ సుబ్బారావు తండ్రి నారాయణ
  2. నల్లూరి కోటయ్య తండ్రి నరసయ్య
  3. నల్లూరి బాలకోటు తండ్రి పెద్ద కొండయ్య
  4. నల్లూరి శ్రీను తండ్రి చినకొండయ్య
  5. తానికొండ సుబ్బారావు తండ్రి నారాయణ
    6.నల్లూరి రోశయ్య

పైన తెలిపిన ఆరుగురు అగ్రకులస్తులు అధికారం ఉందన్న గర్వంతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ వారికి అండగా ఉంటూ వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకునివచ్చి ఎస్ ఐ తో మరియు ఎం.ఆర్.ఓ తో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఈ సమస్యపై విచారణ జరుపుతున్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే అవసరమైతే రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ని కలుస్తాము, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాము, దళితులకు అండగా నిలబడతామని జనసేన తరపున మనోజ్ కుమార్ భరొసా ఇవ్వడం జరిగింది.