విద్యార్ధుల సమస్యను పరిష్కరించాలని జనసేన వినతి

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న మరుగుదొడ్ల సమస్యను పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ మరియు డిఏఓ ఆఫీస్ సూపరింటెండెంట్ లకు జనసేనపార్టీ ఖమ్మం అసెంబ్లీ కో ఆర్డినేటర్ రామకృష్ణ మిరియాల వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ స్పందించని పక్షంలో 20 వ తేదీ తర్వాత జనసేన పార్టీ తరుపున పోరాటం చేస్తాం అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండారు రామకృష్ణ, దేవేందర్, గుండ్ల పవన్ కళ్యాణ్, ఉస్మానియా విద్యార్థి నాయకుడు మహేష్ పెంటల మరియు పుల్లారావు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.