జనసేన మహిళా కార్యవర్గ సమావేశం

నర్సంపేట నియోజకవర్గం: వినుకొండ, నర్సంపేట నియోజకవర్గాల జనసేన మహిళా కార్యవర్గ సమావేశం బుధవారం వినుకొండ జనసేన కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ.. జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి నియోజవర్గంలో 5 సంవత్సరాలలో 25 వేల మంది యువతికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనే జనసేన లక్ష్యం. ప్రతి ఒక్కరూ ప్రజలని చైతన్యం పరచి తెలియజేయవలిసిందిగా కోరడం జరిగింది. అదే విధంగానే జనసేన ప్రభుత్వం స్థాపిస్తే ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య ఇన్సూరెన్స్ లాంటి కార్యక్రమాలను తీసుకు రావడం జరుగుతుంది. మన మొదటి లక్ష్యం పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర ప్రదేశ్ కి సీఎం చేసుకోవడం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా నాయకులు, నియోజవర్గ నాయకులు, స్థానిక మహిళా నాయకులు మరియు మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.