జనంలోకి జనసేన మేనిఫెస్టో

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, ఎచ్చెర్ల మండలం, ఎచ్చెర్ల జంక్షన్ లో ఆదివారం కరిమజ్జి మల్లీశ్వారావు జనసేన మేనిఫెస్టో వివరించడం జరిగింది.

ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేనపార్టీ సీనియర్ నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు 90వ రోజు ప్రతి షాపుకి వెళ్లి జనసేన మేనిఫెస్టో వివరించడం జరిగింది. ఎచ్చెర్ల హెడ్ క్వార్టర్స్ లో ప్రతి షాపులో ప్రతి ఒక్క వ్యాపారస్తులకు స్వయంగా వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాలపై ఆరాతీసి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని వ్యాపారస్తులకు భరోసా ఇవ్వడం జరిగింది. మీసమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకువెళతానని, దీర్ఘకాలిక సమస్యలను రాబోయే రోజుల్లో పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ జనసేన పార్టీ యంపిటీసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, రామస్వామి నాయుడు, దన్నాన బోగినాయుడు, రమణ, నాగేశ్వరరావు, శివాజీ, నానాజీ తదితరులు పాల్గొన్నారు.