నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

  • జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాంకమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

నెల్లూరు నగరం, 45వ డివిజన్ పరిధిలోని విజయమహల్ సెంటర్ వద్ద జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో జనసేన సభ్యత్వాలను ముమ్మరంగా చేయనున్నట్లు ఇంటింటికి తిరిగి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ముఖ్యంగా యువత జనసేన పార్టీలో చేరేటట్లు సభ్యత్వం తీసుకునేటట్లు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం ప్రారంభించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కేకే ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా జనసేన సభ్యత్వాలను ఉదృతంగా నిర్వహిస్తున్నట్లు అలాగే జనసేన పార్టీ విధివిధానాలను ఇంటింటికీ తెలియజేసి భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. తదనంతరం సభ్యత్వం తీసుకున్న వారికి ఉపయోగాలు వివరించారు. ప్రతిఒక్కరు క్రియాశీలక సభ్యులుగా చేరాలని కోరారు. సుమారు 100 మంది కార్యకర్తలు పార్టీ సానుభూతిపరులు సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రిషారెడ్డి యు. రమేష్. జీవన్, వెంకట్రావు, బాల శ్రీధర్, సురేష్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.