బాక్సైట్ మైనింగ్ కు వ్యతిరేఖంగా ఉద్యమిస్తున్న జనసేన

పాడేరు నియోజకవర్గం, జి.మాడుగుల మండలం, పెదలోచలి పంచాయితీ, గొడుగు మామిడి గ్రామంలో జరిగిన బాక్సైట్ వ్యతిరేక అఖిలపక్ష సమావేశంలో బాక్సైట్ మైనింగ్ కు వ్యతిరేఖంగా ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామని, ఈ ఏజెన్సీ ప్రాంత సమగ్రతను నిర్వీర్యం చేసే ఎటువంటి శక్తిని అయిన ఎదిరిస్తామని, బావితరాలకు ఎటువంటి బరోసా ఇవ్వలేని ప్రభుత్వాల తీరుని తీవ్రంగా కండిస్తున్నామని ప్రజల మధ్య జాతి విభేదాలు, కుల రాజకీయాలు సృష్టించి తద్వారా లబ్ధి పొందే రాజకీయ పార్టీలకు రాబోవు ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ది చెప్తారని, ఈ ప్రాంతపు జీవన స్థితిగతుల విధానాన్ని ప్రభావితం చేసే ఈ దుచ్చర్యకైన ప్రజలతో మమేకమై జనసేన పార్టీ తరుపున ఉద్యమం మరింత ఉదృతంగా చేస్తామని పాడేరు నియోజకవర్గ జనసేన గౌరవ అధ్యక్షులు తెరవాడ వెంకట రమణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మండల జనసేనా గౌరవ అధ్యక్షులు తెరవడ వెంకట రమణ, గౌరవ ఉపాధ్యక్షులు. పోతురాస గంగప్రసాద్, యూత్ కమిటీ గౌరవ అధ్యక్షులు మశాడి సింహాచలం, మండల ప్రధాన అధ్యక్షులు మసాడి భీమన్న మరియు వివిధ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.