కాకినాడ 39వ వార్డులో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటీ, జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ సూచనల మేరకు 39వ డివిజన్ చీడీలపోర ప్రాంతంలో డివిజన్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన భీమ్ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ అమాయకులైన దళితులని ఈ వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండీ దాడులు మొదలెట్టిందన్నారు. ఎంత దారుణమంటే దళితులపై దాడులు చేసి తిరిగి వారిపై తమపార్టీలోని అమాయక దళితులతో ఎస్.సి & ఎస్.టి కేసుని బనాయించి కటకటాల పాలు చేస్తోందనిలేదా వారి మరణానికి ఇంత అని రేటుకట్టి డబ్బులతో ప్రాణం విలువ కడుతోందంటూ ఇంతకన్నా అన్యాయం ఇంకేదన్నా ఉందాని దళితులు మౌనంగా రోదిస్తున్నారన్నారు. ఈ ముఖ్యమంత్రికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉందనీ, అందుకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని విమర్శించారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ బండి సుజాత, సోమాలమ్మ, నల్లంశెట్టి సత్యవతి, గడ్డం రాజీ, కుమ్ము మరియా, జనసైనికులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.