గార్లపాడులో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

మదిర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా జనసేన విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు. గార్లపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించాము. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్, కార్యదర్శి అద్దంకి సంతోష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోదుగు పవన్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ షేక్ జానీ పాషా, ఖమ్మం జిల్లా జనసేన విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ నెంబర్ వేముల వినయ్, సజ్జనపు భరత్, మోదుగు రాజా తదితరులు పాల్గొన్నారు.