ప్రజావసరాలను తీర్చే బావిని పూడ్చినందుకు పిర్యాదు చేస్తామన్న జనసేన

తూర్పుగోదావరి జిల్లా కరప మండలం గొడ్డటిపాలెం గ్రామంలో రావి చెట్టు సెంటర్ లో కమిటీ హాల్ ప్రక్కన గత 50 సంవత్సరాల నుండి ప్రజల అవసరాలు తీర్చే వాడకం నీటికి ఉపయోగపడే విధంగా గ్రామ పెద్దల సహకారంతో నిర్మించిన పెద్ద బావిని గ్రామస్తుల ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ అధికారి బావిని అక్రమంగా పూడ్చి వేయడం జరిగింది. ఈ సమస్య పై జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు వీరంరెడ్డి ముత్యాలరావు మరియు జనసేన పార్టీ కరప మండల కార్యదర్శులు గోన ఆంజనేయులు, చొడబత్తుల మణికంఠ, సీనియర్ నాయకులు చోడబత్తుల శ్రీనివాస్, గ్రామ ప్రజలు తెలియజేయడం జరిగింది. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ వారికి మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి గ్రామస్తులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.