కొత్త చెలిక కాలువ పూడిక చేపట్టాలని జనసేన డిమాండ్

ఆత్మకూరు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనతో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దాడి భానుకిరణ్ ఆధ్వర్యంలో సంగం మండలంలోని దువ్వూరు గ్రామం నందు కొత్త చెలిక కాలువని జనసైనికులతో కలిసి సందర్శించడం జరిగింది. కొత్త చిలిక కాలువ బ్రాంచి కాలువ నుంచి దువ్వూరు బస్టాండ్ హైవే వరకు ఉంటుంది. ఈ కాలువ మీద దాదాపు 100 ఎకరాలు పైచిలుకు వ్యవసాయం చేసే రైతులు ఆధారపడి ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ కొత్త చెలిక కాలువ పూడిక తీయకుండా ఉండడం వలన ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 50 ఎకరాలు పైగా వరి పొలాలు నీట మునగడం జరుగుతుంది. అంతేకాకుండా దువ్వూరు గ్రామంలోని వివిధ ఏరియాల నుంచి డ్రైనేజ్ నీరు ఈ కాలువలో కలుస్తాయి. ఈ కాలువలోనే పూడిక తీయకుండా ఉండడం వల్ల నీరు పోయే సదుపాయం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ కాలువలోని నీరు నిల్వ ఉండటం వల్ల గ్రామ ప్రజలకు దోమల వలన విషజ్వరాలు సోకుతున్నాయి. కావున ఈ సమస్యను అధికారులు గుర్తించి కొత్త చెలిక కాలువ పూడికను తీసి ఈ కాలువని కాంక్రీట్ రూపంలో నిర్మించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సంగం మండల నాయకులు ఘంటసాల తిరుమలేష్, సంగం మండలం ప్రధాన కార్యదర్శి కమతం ప్రవీణ్, సాయి, సతీష్, యశ్వంత్, మస్తాన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.