కుళాయి మరమ్మతులు చేపట్టి మంచినీరు సౌకర్యం కల్పించాలని జనసేన డిమాండ్

జనసేన పార్టీ నాయకులు, సాయిబాబా, దురియా, శ్రీ రాములు, మాదల, లక్ష్మణ్, రామకృష్ణ, అల్లంగి

అరకు నియోజకవర్గం, అరకు వేలి మండలం కొత్త బళ్ళు గుడా పంచాయతీ పరిధిలో గల జనం గూడా గ్రామంలో తక్షణమే మంచినీరు సదుపాయం కల్పించాలని జనసేన పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, శనివారం ఆయా గ్రామంలో పర్యటించి అందుగ్గాను గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు, అయితే ఆ గ్రామంలో కొలాయి మరమ్మతులో ఉండటం వలన, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించకపోవడంతో మంచినీరు కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు జనసేన పార్టీ దృష్టికి తీసుకు వచ్చారు, మంచినీరు కోసం రెండు కిలోమీటర్ల దూరంలో గల బురద గడ్డ నీరు తెచ్చుకొని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నామని తెలిపారు, దీనికై జనసేన పార్టీ స్పందిస్తూ ఈ సమస్య మా అందరి సమస్యగా భావిస్తామని ఈ సమస్య పరిష్కారం అయ్యే అంతవరకుమీకు జనసేన పార్టీ అండదండగా ఉంటుందని గిరిజనులకి భరోసానిస్తూనే, ఈ సందర్భంగానే ప్రభుత్వం ఉన్నతాధికారులపై ద్వజమెత్తారు అయ్యా ప్రభుత్వమా వరహ, గోస్తని నదులు మన ప్రాంతంలో ఉన్నప్పటికీ చాలా గ్రామాల్లో మంచి నీరు లేకపోవడం మీ ప్రభుత్వంలోని చూస్తున్నాం చాలా సిగ్గుచేటని తెలిపారు, ఇప్పటికైనా కళ్లు తెరవండి, ఉన్నతాధికారులను కళ్లు తెరవనివండి, ఇప్పటికైనా స్పందిస్తూ జనం గూడ గ్రామంలో మూడు రోజుల లోగా కుళాయి మరమ్మతులు చేపట్టి మెరుగైన మంచినీరు సదుపాయం కల్పించాలని, లేనిపక్షంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీసు వద్ద ముట్టడి కార్యక్రమం చేపట్టేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్న మంటూ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలిపారు, దీనికి ముందుగాను రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కుళాయి మరమ్మతు చేయకపోవడం వల్ల ప్రభుత్వ తీరుపట్ల వ్యతిరేకముగా ర్యాలీగా బయలుదేరి అధికారులు మొండివైఖరి నశించాలి అంటూ నినాదాలు చేస్తూ, నిరుపయోగంగా ఉన్న మంచినీరు ట్యాంక్ వద్ద గ్రామస్తుల ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు, ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసైనికులు, గ్రామ ప్రజలు అల్లంగి, పద్మ జనం, కమల అల్లంగి, సుమిత్ర, జనం ఉర్దూఫ్, ఇల్లు సుందర్ రావు, జనం మంగళ, పట్నాయక్ అప్పన్న తదితరులు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.