ప్రయాణీకులకు మజ్జిగ పంపిణీ చేసిన జనసేన

ఇబ్రహీంపట్నం, తుమ్మలపాలెం గ్రామ జాతీయ రహదారిపై వెళ్ళే ద్విచక్ర వాహనదారులకు, లారీ డ్రైవర్లకు, అర్టీసీ ప్రయాణికులకు మరియు ఆటోలో వెళ్ళే ప్రయాణికులకు జనసేన పార్టీ ఎంపీటీసీ ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి తమవంతు బాధ్యతగా వచ్చి సహాయ సహకారాలు అందించిన తుమ్మలపాలెం జనసేన కార్యకర్తలకు పోలిశెట్టి తేజ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపడం జరిగింది.