ప్రశ్నించే గొంతుల్ని ఇంకెన్నాళ్లు నొక్కేస్తారు

శ్రమకు తగ్గ ప్రతిఫలం అడగటమే నేరమా?

ఏ సీ గదుల్లో కూర్చొని కాదు నడిరోడ్డుపై నిలువు కాళ్ళ మీద నుంచొని అపరిశుభ్రంగా ఉన్న సమాజాన్ని కార్మికులు తమ స్వహస్తాలతో శుభ్రపరుస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేసే పనికి లక్ష రూపాయలు ఇచ్చినా తక్కువే అవుతుంది అంటూ నాడు చెప్పిన పాదయాత్ర నాటి మాటలు ఏమయ్యాయి ముఖ్యమంత్రి గారూ.

ఆరోగ్య, ఆర్ధిక భద్రత లేని పని ఇంకెన్నాళ్లు?

కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చేవరకూ జనసేన కార్మికులకు అండగా ఉంటుంది మరియు వారితో కలిసి పోరాడుతుంది. కార్మికుల ఛలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసిన కార్మిక సంఘాల యూనియన్ నాయకులకు సంఘీభావం తెలియచేసిన జనసేన పార్టీ.