మరణించిన జనసైనికుని కుటుంబానికి అండగా జనసేన

వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం చావలి గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్త బైక్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా వేమూరు మండల అధ్యక్షుడు ఊస రాజేష్, చావలి ప్రెసిడెంట్ విష్ణుమొలకల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చనిపోయిన జనసైనికుని కుటుంబానికి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా 90 వేల రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ బండారు రవి కాంత్, జిల్లా కమిటీ సభ్యులు అడపా మాణిక్యాలరావు, ఇస్మాయిల్ భేగ్, బోడయ్యా, దాసరి శ్రీనివాసరావు, పాములు, బి.రాము, అర్జున్ రావు, శివరామకృష్ణ, శివ పద్ధయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.