Jaggayyapeta: మున్సిపల్ ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన

జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట పట్టణ మున్సిపల్ ఎన్నికలకు జగ్గయ్యపేట పట్టణం 7వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ రజియాబేగం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్బంగా కౌన్సిలర్ అభ్యర్థి రజియాబేగం మాట్లాడుతూ జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో 7వ వార్డ్ తరపున పోటీచేస్తున్నానని ప్రజలు అత్యంత మెజారిటీతో 7వ వార్డులో జనసేనపార్టీని గెలిపించబోతున్నారని ఆమె తెలిపారు. 7వ వార్డులో రజియాబేగం నామినేషన్ దాఖలు చేయగా 8వ వార్డు తరపున శ్రీ సిరివెళ్ళ శ్రీనివాసరావు mariyu 2వ వార్డ్ జనసేన పార్టీ అభ్యర్థిగా ఈమని కిషోర్ కుమార్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి బాడీశ మురళీకృష్ణ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్, ముత్యాల శ్రీనివాసరావు, తునికిపాటి శివ, నలబోతుల శివ, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.