కిడ్నీలు పాడైన వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికసాయమందించిన జనసేన

రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, శృంగారపాడు కాలనీకి చెందిన పరస సత్యనారాయణ కి రెండు కిడ్నీలు పాడైపోయి.. వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతుండగా.. విషయం తెలుసుకున్న గూడపల్లి గ్రామానికి చెందిన జనసేన వార్డ్ నెంబర్ అడబల నాగేశ్వరరావు మరియు జనసేన కార్యకర్తలు కోసాన వీరబాబు, ఉలిశెట్టి శ్రీను, కటికిరెడ్డి శ్రీను కలిసీ సత్యనారాయణ కి 5000 రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేయడం జరిగింది. సహాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయవలసిందిగా గూడపల్లి జనసేన వార్డ్ మెంబర్ అడబాల నాగేశ్వరావు ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది.