లక్కవరం ఓల్డ్ ఏజ్ హోమ్ కి జనసేన ఆర్ధికసాయం

రాజోలు, లక్కవరం ఓల్డ్ ఏజ్ హోమ్ లో మాజీ కెనరా బ్యాంక్ మేనేజర్, జనసేన నాయకులు గొల్ల మందల పూర్ణ భాస్కరరావు మనవడి పుట్టినరోజు సందర్భంగా శనివారం వృద్ధాప్యంతో ఉంటూ అనాధలు అయిన వారికి అవసరమైన నిత్యావసరాలతో పాటు ఫ్రూట్స్ అలాగే వారి అవసరాల కొరకు 10,000/- రూపాయల నగదును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, రాజోలు గ్రామశాఖ అధ్యక్షులు కాట్న రాజు, ఉండపల్లి అంజి, కోళ్ల బాబి, అడబాల అప్పాజీ, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.