అగ్నిప్రమాద భాదిత కుటుంబానికి జనసేన ఆర్ధిక సాయం

  • కుటుంబానికి కావలసిన నిత్యవసర వస్తువుల అందజేత

అమలాపురం రూరల్: శనివారం రాత్రి అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గ్రామంలో జనసైనికుడు బొలిశెట్టి శివకు చెందిన ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో అతని కుటుంబం రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న అమలాపురం పార్లమెంట్ జనసేన పార్టీ ఇంఛార్జి డి.ఎం.ఆర్ శేఖర్ మరియు జనసేన నాయకులు, తెలుగుదేశం అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఆనందరావు మెట్ల రమణబాబు చేరుకుని వారితో మాట్లాడి ఆ కుటుంబానికి తక్షణ సాయంగా జనసేన శ్రేణుల తరపున 50 వేల రూపాయిలు నిత్యవసర వస్తువులు అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, సీనియర్ నాయకులు లింగోలు పండు, ఆర్.డి.యస్.ప్రసాద్, పోలిశెట్టి బాబులు, డాక్టర్స్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగ మానస, అల్లాడ రవి, నల్లా వెంకటేశ్వర రావు, పోలిశెట్టి కన్నా, కంకిపాటి గోపి, మద్దింశెట్టి ప్రసాద్, చేట్ల మంగతాయారు, పాలూరి నారాయణ స్వామి, గంధం శ్రీను, నల్లా మూర్తి, సత్తిబాబు, రంకిరెడ్డి కృష్ణ, రంగాపురపు దొరబాబు, నిమ్మకాయల సాయి, యర్రంశెట్టి సాయి మరియు జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.