మహిళలకు అండగా జనసేన

  • జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా జనసేన రాఖీల పంపిణీ కార్యక్రమం

విజయనగరం: మహిళలు ఆర్ధిక ప్రగతి సాధించాలని, అన్ని రంగాల్లో చురుకైన పాత్ర పోషించాలని, పూర్వీకుల అడుగు జాడల్లో మహిళలు ప్రేరణ పొందాలని, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు అండగా వుంటామని జనసేన నేతలు గురాన అయ్యలు, తుమ్మి లక్ష్మీ, కాటం అశ్విని అన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా హోటల్‌ జిఎస్‌ఆర్‌ వద్ద బుధవారం జనసేన రాఖీల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబనకు జనసేన కృషి చేస్తుందని, మహిళలకు ఇబ్బందులు ఎదురైతే జిల్లా న్యాయవిభాగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని పేర్కొన్నారు. రోజురోజుకూ అత్యాచారాలు, దాడులు పెరిగి పోయాయని అన్నారు. దిశ చట్టం ప్రచారార్భాటమేన్నారు. బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు వీరమహిళలు పోరాడి వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మద్యపాన నిషేధం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి నేడు మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకొని మోసం చేశారన్నారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ మహిళల తాళిబొట్లు తెంచుతున్న దుర్మార్గ పాలన నడుస్తోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు చక్రవర్తి, రవితేజ, పుష్ప, మాతా గాయిత్రి, సుంకరి వంశీ, వజ్రపునవీన్, కళ్యాణ్, సాయి, అడబాల వేంకటేష్, పవన్ కుమార్, అభిలాష్, గవర శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.