క్యాన్సర్ తో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి జనసేన నాయకుల సాయం

నెల్లిముక్కు గ్రామం, నాయి బ్రాహ్మణ వీధిలో నివాసం ఉంటున్న కోరుబిల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి క్యాన్సర్ తో మృతి చెందారు. శనివారం ఆ కుటుంబాని మాజీ వైస్ చైర్మన్, జనసేన నాయకులు కోన చిన అప్పారావు పరామర్శించి.. ఆ కుటుంబానికి నెలకు సరిపడా గ్రోసరీస్ ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మీకు ఎలాంటి సాయం కావాలన్నా మేమున్నామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రేమనిది ఫౌండేషన్ చైర్మన్ అంజురి దీపక్, జనసేన పార్టీ వీర మహిళ దాసరి జ్యోతి రెడ్డి, పెద్దగంట్యాడ మండల బిజెపి అధ్యక్షులు కిల్లాని ముసలయ్య, జన సైనికులు నీలాపు శ్రీనివాస్ రెడ్డి, కోన అప్పారావు (శివ), స్టీల్ ఐ ఎన్ టి యు సి నాయకులు ఓబీసీ నాయకులు కోరిబిల్లి అప్పారావు, నాయి బ్రాహ్మణ అసోసియేషన్ అధ్యక్షులు కోరుబిల్లి గోవిందరావు, మహేష్, కింతాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.