పయ్యావులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో జనసేన

  • జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గౌతమ్ కుమార్
  • జనసేన పార్టీ మండల అధ్యక్షులు కాశంశెట్టి సుధీర్

బెలుగుప్ప మండలంలోని కోనంపల్లి, గంగవరం, శిర్పీ, యలగలవంక తండా, నరసాపురం గ్రామాలలో ఉరవకొండ నియోజకవర్గ ఎన్. డి.ఎ కూటమి అభ్యర్థి అయిన పయ్యావుల కేశవ్ కు మద్దతుగా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారని, వృద్దులకు 4000 రూపాయల పెన్షన్ అని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తారని, నిరుద్యోగ బృతి కింద నిరుద్యోగులకు నెలకు 3000 ఇస్తారని యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, రైతులకు పెట్టుబడి సాయం అందించడం జరుగుతుంది అని మరియు ఇరుపార్టీలు ఇచ్చిన హామీలను ప్రజలకు తెలియజేశారు. ప్రచారంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గౌతమ్ కుమార్, బెలుగుప్ప మండల అధ్యక్షులు కాశంశెట్టి సుధీర్, వజ్రకరూరు మండల అధ్యక్షులు అచ్చనాల కేశవ్, విడపనకల్లు మండల అధ్యక్షులు తలారి గోపాల్, కుడేరు మండల అధ్యక్షులు నగేష్, నాయకులు మధు, కృష్ణ, నాని, శివ, సతీష్, అభి, శివరాజ్ కుమార్, మర్రిస్వామి, రాజేష్, భీమేశ్, హరిశంకర్ నాయక్, శ్రీను నాయక్, రవి, లోకేష్, భద్ర, ధనుంజయ, సమర, చందు, నవీన్, సాయి మరియు జనసైనికులు పాల్గొన్నారు.