కౌలు రైతుకి అండగా జనసేన

హిందూపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం తన కష్టార్జితం నుండి 30 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆదే విదంగా ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి జిల్లాల వారీగా చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శిస్తూ వారికి లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుంది. ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియలనే దృఢ సంకల్పంతో టీం పిడికిలి వారి గోడ పత్రికలు ఆదివారం మొదటి వార్డ్ కొట్నూర్, కొల్లకుంట, ఇందిరమ్మ కాలనీలో జనసైనికులు పోస్టర్లని ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో మొదటి వార్డ్ జనసైనికలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.