ఆపదలో ఉన్న వారికి అండగా ఉండే పార్టీ జనసేన: డాక్టర్ యుగంధర్ పొన్న

  • కళావతి కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, దిగువ పల్లాలు పంచాయితీ, వైయస్సార్ ఎస్పీ కాలనీలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన కళావతి ఇంటిని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న సందర్శించారు. వారిని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ఆపదలో ఉండే వారికి ఆపన్న హస్తం ఇచ్చే పార్టీ జనసేన అని, నిరాశ్రయుల పక్షాన పోరాడేది కూడా జనసేన పార్టీయే అని, బాధాతప్త హృదయలకు అండగా నిలిచేది కూడా జనసేన పార్టీ అని కొనియాడారు. కళావతి కుటుంబాన్ని నియోజకవర్గంలో ఉన్న దాతలు అందరు ఆదుకోవాలని, నిలువ నీడ లేనటువంటి ఈ కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని, త్వరగా మరొక పాక వేసుకోవటానికి దాతలు సహాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మండల తాసిల్దార్ తో పాటు సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి జగనన్న కాలనీలో చోటు కల్పించి, హౌసింగ్ అధికారులే ఈ గిరిజన పుత్రులకి అండగా నిలబడి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అది కూడా యుద్ధ ప్రాతిపదికన జరగాలని, మానవతా దృక్పధంతో అలోచించి మేలు చేయాలనీ విజ్ఞప్తి చేశారు. కళావతి కుటుంబానికి అండగా నిలిచిన లక్ష్మీ మొబైల్ సదినేత ప్రసాద్ కు, సోక్రటీస్ విద్యా సంస్థల అధినేత గుణశేఖర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా దాతలు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వినర్ యతిశ్వర్ రెడ్డి, నియోజకవర్గం కార్యదర్శి అన్నామలై, జిల్లా సంయుక్త కార్యదర్శి నరేష్, కార్వేటి నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు సూర్య నరసింహులు, యం యం విలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర, జనసైనికులు పాల్గొన్నారు.