పసుపులేటి శ్రీను, రెడ్డి రంగారావులకు నివాళులర్పించిన జనసేన నాయకులు

అమైలవరం, అగ్నికి అహుతి అయి మరణించిన జనసేన పార్టీ కార్యకర్తలు పసుపులేటి శ్రీను, రెడ్డి రంగారావులకు నివాళులు అర్పించి వారి కుటంబ సభ్యులను పరామర్శించిన జనసేన మైలవరం ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహనరావు (గాంధి). తుమ్మలపాలెం గ్రామస్తులు శ్రీను, రంగా లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ డ్యూటీ నిర్వహణలో భాగంగా దొనబండ వద్ద లారీ యాక్సిడెంట్ అయి మంటలు ఏర్పడి ఇద్దరు పూర్తిగా అహుతి అయి చనిపోయారు. పరామర్శించిన వారిలో నాయకులు చింతల లక్ష్మి, పోలిశెట్టి తేజ, మల్లిశ్వరావు, పూర్ణచంద్రరావు, వీరాంజనేయిలు, పవన్, నాగబాబు, వై. ప్రవీణ్ తదితరులు ఉన్నారు.