క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు

కాకినాడ సిటీ, ప్రేమని పంచే క్రీస్తు పండుగకు క్రైస్తవ సోదర సోదరీమణులు సమాయత్తమవుతూ క్రిస్మస్ పండగకు తమ సంతోషాన్ని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతోను, బంధువులు చుట్టాలతో పంచుకుంటూ తమ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేసారు. ఈ పండుగ వాతావరణంలో ఈ పండగ అందరి జీవితాలను కాంతిమయం చేయాలని ఆకాంక్షిస్తూ ప్రార్ధనలు చేస్తూ ప్రభువుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, బిర అంజలి, కొల్లు మాణిక్యం, కామాడి చందర్రావు, రోక్కం అప్పాయమ్మ తదితరులు పాల్గొన్నారు.