జాడిగుడాలో పర్యటించిన జనసేన నాయకులు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో గల వనబంగి పంచాయితీ జాడిగుడాలో పర్యటించిన జనసేన పార్టీ మండల నాయకులు జాడిగుడా గ్రామ ప్రజలు ఆహ్వానం మేరకు ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ప్రధాన సమస్యల గురించి పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ మరియు జనసైనికులు ముఖ్యంగా మంచినీటి సమస్యను గుర్తించి ఆ సమస్య నిర్మూలనకు ప్రభుత్వం సహకారం కోసం గ్రామస్తులు ఎలా తెలిజేయలో వివరించారు. అలాగే గ్రామంలో మురుగునీటి కాలువ సమస్య ఎక్కువగా ఉందని గుర్తించి ప్రజలకు పరిశుభ్రత గూర్చి తెలియజేసారు. నిజానికి ప్రభుత్వం ఇటువంటి స్థానిక సమస్యలను పంచాయితీ రాజ్ శాఖ తరపున వచ్చే నిధులతో ఈ మౌళిక సదుపాయాలు, మంచినీటి, డ్రైనేజీ కాలువల సమస్యలను తీర్చాలి కానీ ఇవ్వాళ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖ నిధులు దారి మళ్లించి గ్రామ స్వరాజ్య హక్కుల్ని కూడా కాలరాస్తుందని ప్రజలు చైతన్యవంతం కావడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదని తెలిపారు. మొన్న 15, 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన రాజకీయ కుట్రలు జనసేనపార్టీ శక్తిని ఆపలేవని రానున్న భవిష్యత్ లో మార్పుకోసం ప్రబలమైన రాజకీయ శక్తిగా జనసేనపార్టీ ఎదుగుతుందని ప్రజలు తమ ఆలోచనాధోరణి వాస్తవానికి నిజాయితీగల నాయకులను గుర్తించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఈ సందర్బంగా జాగరపు పవన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్, శ్రీను, జీవన్ కుమార్, కళ్యాణ్ కుమార్, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.