గునిశెట్టి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామంలో అకాల మరణం చెందిన గునిశెట్టి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను జనసేన నాయకులు రాజేశ్వరావు బొంతు, రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు తదితరులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.

బోణం సాయిని పరామర్శించిన రాజోలు జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, బట్టెలంక గ్రామంలో జనసేన నాయకులు బోణం సాయి తల్లి కాలం చేయడంతో రాజోలు జనసేన నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరావు బొంతు, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు.

చిట్టెం దాసు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజోలు జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో యాక్సిడెంటులో మరణించిన చిట్టెం దాసు కుటుంబ సభ్యులను రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరావు బొంతు, రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు తదితరులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.

ఘనంగా వీర వెంకట్ పుట్టినరోజు వేడుక

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, మలికిపురంలో రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో వీర వెంకట్ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు బొంతు అరుణ కుమారి దంపతులు, మలికిపురం మండలం జనసేన పార్టీ ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, మేకల ఏసుబాబు, పోలిశెట్టి గణేష్, ఎరుబండి చిన్ని, అన్నపూర్ణ, వీర మహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

సీఎం జగన్ రాజ్యాంగ విలువల్ని తుంగలోతొక్కుతున్నారు: బొంతు రాజేశ్వరరావు

  • నిరూపితం కానీ ఆరోపణలతో చంద్రబాబును అరెస్టు చేశారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నీచాతి నీచమైన పాలన సాగిస్తున్నారని రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు అన్నారు. మలికిపురం మండలం మలికిపురంలో ఆయన పత్రికా ముఖంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అరెస్టును ఖండిస్తున్నామన్నారు. ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్ చంద్రబాబుని అరెస్టు చేయించారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించి, నీతి నిజాయితీకి మారుపేరైన జనసేనకు అవకాశం ఇవ్వాలన్నారు.

బొంతు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో వైస్సార్సీపీ, టీడీపీ నుండి అధిక సంఖ్యలో బీసీ సామాజికవర్గం, క్షత్రియవర్గాలకు చెందిన రుద్రరాజు సూర్యనారాయణ రాజు, కుడిపూడి శివమణి, మందపాటి అయ్యప్ప స్వామి, మందపాటి శ్యాంప్రసాద్, నక్క దొరబాబు, ఇంగు సూర్యనారాయణ, గూమిలి చిరంజీవి, అల్లు సాయి కృష్ణ, కోనేరెడ్డి మణికంఠ, సోడిశెట్టి రాము తదితరులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసే విధంగా అందరూ పని చేయాలని 2024 ఎన్నికలలో జనసేన జెండా ఎగురవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మలికిపురం మండల ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, రాజోలు మండల వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద రాజు, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు సత్తిబాబు, గుబ్బల నారాయణరావు, కాండ్రేగుల వెంకటేశ్వరరావు, మేకల ఏసుబాబు, నేల శీను, బత్తుల రాజేష్, కోళ్ళ బాబీ, పోలిశెట్టి గణేష్, ఎరుబండి చిన్ని తదితరులు పాల్గొన్నారు.