దళితవాడలో మారణాయుధాలతో జరిగిన ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు ఎస్సీ కాలనీలో అదే గ్రామానికి చెందిన సాయి రెడ్డి అతని అనుచరులు తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో ఆటోలో వచ్చి మారణాయుధాలతో విచక్షణారహితంగా మిడసల సుబ్బారావు అతని కుమారుడు మిడసల రామ్ ప్రసాద్ ని తలపై రాడ్డు తో కొట్టారు. ఆ అబ్బాయిని రక్షించే క్రమంలో మహిళ అడ్డు రాగ, మహిళ అని కూడా చూడకుండా మారణాయుధాలతో మిడసల సుజాతనీ గాయపరిచారు. వెంటనే వారి ఇంటి వద్ద కుక్కని వదిలిన తర్వాత పారిపోయే క్రమంలో కొంతమంది ఇంట్లో జోరపడగా, మరికొందరు పారిపోవడం జరిగిందని, పరామర్శించడానికి వెళ్ళిన జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షుడికి జరిగిన విషయాన్ని మిడసల సుబ్బారావు తెలియజేశారు. ముందురోజు పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో కొండపైన గుడి ఆవరణలో తిరుపతిపవన్ కుమార్ ని కొట్టి, గాయపరిచారని సుబ్బారావు తెలియపరిచారు. కానీ గ్రామం మీదికి అర్ధరాత్రి సమయంలో మారణాయుధాలతో హల్ చల్ చేయడంపై గ్రామస్తులంతా భయభ్రాంతులకు గురై అయోమయంలో ఉన్నారు. ఏం జరిగింది అని తెలుసుకునే లోపే సుబ్బారావుకి అతని కుమారుడికి తలపై రక్తస్రావం రావడంతో గమనించిన గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అని సుబ్బారావు తెలియపరిచారు. సిఐ లక్ష్మణ్, ఎస్ఐ సంపత్ కుమార్, వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కొంతమంది ముద్దాయిల ని అదుపులో తీసుకొని, గాయపడినవారిని చికిత్స నిమిత్తం కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ సుబ్బారావు మరియు అతని కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించి వారికి మధ్యాహ్నం భోజనం మరియు పళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారైనా లక్ష్మణ్, ఎస్ఐ సంపత్ కుమార్, దోషులు ఎంతటివారైనా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని సింగరాయకొండ మండల అధ్యక్షులు రాజేష్ కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, కందుకూరు మండల అధ్యక్షులు మదన్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు కాసుల శ్రీకాంత్, కొణిదల సిద్దయ్య,మండల కమిటీ నాయకులు గుంటుపల్లి శ్రీనివాస్, అనుమల శెట్టి కిరణ్ బాబు, శీలం సాయి, గుండు రెడ్డి శివ,షేక్ సుభాని, గోరంట్ల కళ్యాణ్, రాయి చందు, మరియు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.