గేదెల వెంకట్రావుని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు, శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఉప్పాడ అమీనాబాద్ నందు తనకెంతో ఆప్తుడైనటువంటి సీనియర్ నిస్వార్థ జన సైనికుడు పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తూ జనసేన పార్టీ కోసం ప్రాణం పెట్టే గేదెల వెంకట్రావు ఇటీవల అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల నుండి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వెంకట్రావుని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి క్షుణ్ణంగా తెలుసుకుని తగిన ఆరోగ్య సూచనలు సలహాలను తీసుకోవలసిన తగు జాగ్రత్తలను అందించిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ వైద్య ఖర్చుల నిమిత్తం 5000/- రూపాయలు గేదెల వెంకటరావుకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన దొర, వంకా కొండబాబు, రాజు, జాన్సన్, నాని, శ్రీనివాస్, శశి, వీరబాబు, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.