మరద అప్పారావుని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామానికి చెందినటువంటి మరద అప్పారావు ఇటీవల బోట్ యాక్సిడెంట్ కారణంగా బోటుకి ఉన్నటువంటి పంకా తగిలి గాయపడినటువంటి మరద అప్పారావు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి బెడ్ రెస్ట్ తీసుకున్నటువంటి అప్పారావుని పరామర్శించిన పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారికి తగిలిన గాయాన్ని వేసిన కుట్లను పరిశీలించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తగిన సూచనలు సలహాలు అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసర నిమిత్తం బియ్యం బస్తా మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, జనసేన నాయకులు పల్లేటి బాపన్న దొర, రామిశెట్టి రాంబాబు, పల్నాటి మధుబాబు, పుక్కల్ల కుమార్, బి అప్పారావు మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.