గాదరాడలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • బత్తులకు జేజేలు కొడుతున్న గాదరాడ గ్రామ ప్రజలు
  • స్థానికుడైన బత్తులకే మా ఓటు అని గంటాపదంగా చెబుతున్న ప్రజలు..
  • గ్రామంలో అందరినోటా ఒకటే మాట బత్తుల బలరామకృష్ణ గారే మా ఎమ్మెల్యే
  • తీన్మార్ డప్పులతో, భారీ బాణాసంచా పేల్చుతూ.. అడుగడుగునా ఆడపడుచుల ఆశీర్వాదములతో హారతులతో పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికిన ప్రజానీకం
  • సుమారు 1500 మందితో ముందుకు సాగిన పాదయాత్ర

రాజానగరం: రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు ప్రజలకు చేరువచేస్తూ.. గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ.. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. రామరాజ్యం తీసుకువస్తానని నమ్మించి ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిన ఈ దుర్మార్గపు దుష్ట వైస్సార్సీపీ పాలనను అంతమోందించి ప్రజా పరిపాలన సుపరిపాలన తీసుకురావడానికి… మన తరువాతి తరాల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడానికి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి మన బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి అని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీచైన్ అందజేసిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.