మహాత్ముడికి ఘన నివాళులర్పించిన జనసేన

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో
జనసేన నాయకులు, వీరమహిళలతో కలిసి ఆపార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఘన నివాళులు అర్పించారు. సోమవారం ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడలి వద్దగల గాంధీ విగ్రహానికి వారు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. దేశం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం మన అందరి బాధ్యతని చెప్పారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో మహాత్ముల గొప్పతనాలు వివరిస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో మునుస్వామి, లక్ష్మి, చందన, హిమవంత్, రమేష్ నాయుడు, హేమంత్, గుట్టా నాగరాజు, పవన్, ఆది, పురుషోత్తం, రాజేంద్ర, విశ్వ పురుషోత్తం రాయల్, రమేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.