జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ జన్మదిన వేడుకలు

నెల్లూరు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జన్మదిన సందర్భంగా ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటి వద్ద నుంచి పార్టీ ఆఫీస్ కి వందలాది జనసైనికులు ర్యాలీగా వచ్చి పండుగ వాతావరణంతో జన్మదిన వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జనసైనికులను అలరింప చేశారు. ఈ సందర్భంగా మనుక్రాంత్ మాట్లాడుతూ 2018 నుంచి జనసేన పార్టీకి నిజాయితీగా పని చేసిన జనసేన నాయకులు గునుకుల కిషోర్ నిస్వార్థంగా పార్టీకి ఎంతో సేవ చేశారు. ఎంతోమంది జనసైనికులు అభిమానాన్ని మూటగట్టుకున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా తన సేవలను ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ… ఆకాశమే హద్దుగా పలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలిపిన మీ ప్రేమాభిమానాలకు సదా దాసుడను ఇంతటి ప్రేమ, అభిమానాలకు మూలకారణమైన పవన్ కళ్యాణ్ కి, మనుక్రాంత్ కి, జనసేన పార్టీకి ఎంతో రుణపడి ఉన్నాను అని తెలిపారు. మీలో ఒకడిగా మీతో ఒకడిగా మన ఆశయ సాధనకు మరింత బాధ్యతతో పని చేస్తాననీ, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. పండగ వాతావరణంలో జరిగిన జన్మదిన వేడుకలకి జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పాటు జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్, అధికార ప్రతినిధి కలవాయి సుదీర్, ఇతర జనసేన నాయకులు గుడి హరి రెడ్డి, సురాయపాలెం పవన్, సుజన్, హేమచంద్ర, ఉమాదేవి, రాజా తదితరులు పాల్గొన్నారు.