పాసర్లపూడి లంక గ్రామ సమస్యలపై జనసేన వినతి పత్రం

గన్నవరం: మామిడికుదురు మండలం, పాసర్లపూడి లంక గ్రామంలో గురువారం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు గ్రామ సమస్యలపై వినతి పత్రం ఇవ్వటం జరిగింది. వినతి పత్రంలో ముఖ్యమైన సమస్యలు సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలని, ఉప్పుటేరు బ్రిడ్జి ఎప్పుడు కొత్తది ననిర్మించాలని, పాసర్లపూడి లంక గ్రామంలో లైన్మెన్ లేడని కొత్త లైన్ వెయ్యాలని, ఆక్వా రైతులు ప్రజలు కరెంటు కష్టాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అభ్యర్థి చెరుకూరి పార్వతీదేవి, సత్తిబాబు, గ్రామ శాఖ తెలగారెడ్డి, బుల్లి నాగేశ్వరరావు, వింజేటి రవి, బొరుసు వీర వెంకట్ రావు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.